![]() |
![]() |

ఈవారం రావోయి చందమామ వెర్సెస్ మా అత్త బంగారం సీరియల్ టీమ్స్ సుమ అడ్డా షోకి వచ్చాయి. ఇక ఈ షోలో ఈ రెండు సీరియల్ టీమ్స్ వాళ్ళతో చాలా గేమ్స్ ఆడించింది సుమ. రావోయి చందమామ సీరియల్ యాక్టర్ ఐన సెల్వ రాజ్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. " మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది..ఎలా జరిగింది" అని అడిగింది. "ఒకసారి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది నాకు. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయ్యింది. సేమ్ సినిమా స్టయిల్లో అయ్యింది పెళ్లి. కట్టుబట్టలతో కాలేజీ నుంచి ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నా. అవతల వాళ్లకు గట్టిగానే ధమ్కీ ఇచ్చాను. ఇప్పుడు అంతా సెట్ ఐపోయింది. ఇక ఇండస్ట్రీలో మొట్టమొదటి కెమెరా ఇంట్రడక్షన్ మూవీ తొలి ప్రేమ. అప్పుడు నేను సిక్స్ ప్యాక్ బాడీతో ఉండేవాడిని. మిస్టర్ ఇండియా, మిస్టర్ హైదరాబాద్ పోటీల కోసం బాడీని బిల్డ్ చేస్తున్నాను. ఆ టైములో బాడీ బిల్డర్స్ కావాలి అని అడిగేసరికి నన్ను తీసుకెళ్లారు. షూటింగ్ టైములో పవన్ కళ్యాణ్ నన్ను చూసి బాడీని బాగా బిల్డ్ చేసావ్ అని మెచ్చుకున్నారు.. అలాగే నా కోసం ఒక చిన్న బిట్ ని క్రియేట్ చేశారు. తరువాత తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ కి ఫిజికల్ ట్రైనర్ ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి పెట్టించారు. ఆ తర్వాత బద్రి మూవీలో కూడా చేశా. అలా నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయ్యింది." అని చెప్పాడు.
ఇక సెల్వ బాడీ బిల్డర్‌గా కెరీర్ స్టార్ట్ చేసాడు. అతను రెండుసార్లు మిస్టర్ హైదరాబాద్ టైటిల్‌ను గెలిచాడు. 1998లో అస్సాంలో మిస్టర్ ఇండియా తరపున పార్టిసిపేట్ చేసాడు. సెల్వరాజ్ జెమినీ టీవీలో ప్రసారమైన 'చక్రవాకం' సీరియల్లో ఇక్బాల్‌గా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే తెలుగులో హిట్ సీరియల్ "మొగలి రేకులు" లో కూడా నటించాడు.
![]() |
![]() |